Showing posts with label My Telugu Stories. Show all posts
Showing posts with label My Telugu Stories. Show all posts

Wednesday, January 29, 2020

ఎలా???


సంధ్య కి  మూడు రోజుల నుండి గుబులు గా ఉంది. 4 రోజుల క్రితం వాళ్ళ నాన్న గారు ఫోన్  చేసి విశాఖపట్నం  రమన్నారు . సంధ్య డిగ్రీ అవ్వగానే హైదరాబాద్ వచ్చేసింది ఉద్యోగం కోసం . అక్కడే ఉద్యోగం దొరకడం, పెళ్లి కొడుకు కూడా అక్కడే ఉండడం తో సంధ్య పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైపోయింది. ఎప్పుడైనా పుట్టింటికి మెట్టినింటికి వెళ్లి రావడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు సంధ్య భర్త కూడా ఊళ్ళో లేదు. ఆఫీస్ పని మీద అమెరికా వెళ్లారు. పిల్లల్ని అత్తగారు మామ గారు చూసుకుంటారు, దానికి బెంగ లేదు. కానీ ఇప్పుడు వెళ్ళడానికి ఒకే సమస్య, ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదు. బస్సు లోనే వెళ్ళాలి, అదీ సంధ్య దిగులు.
మానేద్దామా అనుకున్నా, అక్కడ జరుగుతున్నది స్వయానా బాబాయ్ కూతురి పెళ్లి. చిన్నప్పటి నుండి ఒక దగ్గర పెరిగిన వాళ్ళు, పెళ్ళికి కూడా వెళ్లకపోతే బావుండదని బయలు దేరుతోంది. పిల్లలకి అస్సైన్మెంట్లు, ప్రాజెక్టులు ఉన్నాయ్ అని రాము అన్నారు. పిల్లలని అత్తగారికి అప్పగించి సంధ్య ఒక్కర్తీ బయలు దేరింది. రాత్రి 10 గంటలకి బస్సు.
అన్నం తిని నీళ్లు తాగితే ఎక్కడ టాయిలెట్ కి ఇబ్బంది పడతానో అని ఎదో చపాతీ తిన్న అనిపించి కంచం ముందు
నుంచి లేచిపోయింది. బస్సు దగ్గరకి వెళ్లే ముందు 2 సార్లు బాత్రూమ్ కి వెళ్లి వచ్చింది. టెన్షన్ లో ఇంకా ఘోరం గా ఉంది సంధ్య పరిస్థితి.10 గంటలకి రావలసిన బస్సు నిక్కీ నీలిగి 11.30 కి వచ్చింది। అంతవరకు అక్కడ నిలబడడం తప్ప ఏమి చేయలేకపోయింది సంధ్య. మొత్తానికి బస్సు వచ్చింది, ఆమె డ్రైవర్ ని సరైన టైం కి రావద్దా అని దులిపేసింది . ఇప్పుడు వచ్చింది ఈ దిక్కుమాలిన బస్సు ఎప్పటికి వైజాగ్ చేరుతుందో అనుకుంటూ ఎక్కింది . ఆమె ఎక్కినా వెంటనే నిద్రపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ డ్రైవర్  వేసే సడన్ బ్రేకులు, మలుపు తిప్పేటప్పుడు పక్కవారి మీద పడేటట్లు గా తిప్పే నేర్పు, గుంటల్లో మాత్రమే తీసుకెళ్లగలిగిన ఓర్పు తో సంధ్యకు  నిద్ర కరువైంది.
దేనికైతే భయపడిందో మొత్తానికి ఆ క్షణం సంధ్య కి వచ్చేసింది. ఇంతలో  బస్సు ఒక చోట ఆగింది "ఇక్కడ బాత్రూములు కి ఆపుతాం దిగండి దిగండి” అని క్లీనర్ అరుస్తున్నాడు. హమ్మయ్య దేవుడు కరుణించెదనుకుంటూ సంధ్య చుట్టూ  చూసింది... తన ఖర్మ కొద్దీ చుట్టూ చిన్న మధ్య  ఆఖరి వయసులలో ఉన్న మొగవాళ్ళు తప్ప ఆడవాళ్ళూ ఎవ్వరు లేవట్లేదు. అయినా తన వల్ల కాదు అనుకుని అందరూ దిగాక తాను బస్సు దిగింది. చూసేసరికి అక్కడ బాత్రూమ్స్ ఏమి లేవు. ఒక ఓపెన్ ప్లేస్ లో మొగాళ్ళు అందరు ఆ పని కానిస్తున్నారు. తన బాధను అర్ధం చేసుకున్నాడు అనుకుంట క్లీనర్, " ఆ వైపు వెళ్ళండి మేడం  అని చూపించాడు అక్కడ అంతా చీకటి ఖాళీ ప్రదేశం. "ఎక్కడ " అని అడిగింది ఏమని అడగాలో తెలియక. "ఆలా వెళ్ళండి మేడం పర్వాలేదు ఎం కనిపించదు " అన్నాడు తనకి సమాధానం గా. సంధ్య సిగ్గు తో చచ్చిపోయింది. కానీ అక్కడ కనీసం చాటు కూడా లేదు. ఎలా?
సంధ్య ఎటు వెళ్లలేక బస్సు ఎక్కేసింది. ఏదైతే అది అవుతుంది అని. అసహ్యం గా తన బాత్రూం విషయం ఎవడో తెలియని క్లీనర్ తో ఎలా చర్చించడం? కానీ ఇప్పుడు వెళ్లకపోతే పొద్దున్న 10 అవుతుందో 11 అవుతుందో వైజాగ్ వెళ్ళేటప్పటికి .
బస్సు ఎక్కినా సంధ్య  పడుకుందాం అని ట్రై చేసింది, కానీ దురదృష్టం తనని వెంటాడింది. పోనీ ఆ ఆలోచన లోంచి బయటపడి వేరే ఆలోచన చేస్తే ఏమైనా బావుంటుందని ఫోన్ తీసి యూట్యూబ్ నొక్కింది. అక్కడ తన అదృష్టం బాలేదు అన్ని నవ్వించే వీడియోస్ ఏ కనిపిస్తున్నాయి, కాసేపు బానే ఉంది అనిపించినా తరువాత మళ్ళి అదే ఉధృతి. ఏం చెయ్యడానికి పాలుపోలేదు. దృష్ఠి మరలార్చడానికి కూడా వీలు కావట్లేదు. మొదటి సరి మొగవాడి గా పుట్టనందుకు తాను బాధ పడింది.ఇంతకూ ముందు మొగవాళ్లందరూ హాయిగా ఆరుబయట తమ పని కానిచ్చారు, మరి తనకు? ఆడపిల్ల అయినందుకు ఈ  నరకం తప్పదేమో!!
క్షణ క్షణానికి ఉదృతి ఎక్కువ అవుతోంది. ట్రైన్ లో టికెట్ బుక్ చేయనందుకు తన భర్తని, పిలిచినందుకు తన చుట్టాలని, సెలవు ఇచ్చినందుకు తన బాస్ ని,  వచ్చినందుకు తనని వెయ్యినొక్క సార్లు తిట్టుకున్నా తరువాత, ఇక ఆగలేక ఎక్కడైనా డ్రైవర్ బస్సు అవుతాడేమో అని సంధ్య డ్రైవర్ కేబిన్ వైపు వెళ్ళింది. ఈ సారి  ఆరుబయట ఐన పర్లేదు అనుకుంది. డ్రైవర్ కేబిన్ లో "ఆకలేస్తే అన్నం పెడతా" అంటూ సంబంధం లేని పాట ఒకటి వస్తోంది. అక్కడి దాకా వచ్చిన సంధ్య కి డ్రైవర్ తో ఎలా చెప్పడం? నేను ఒకసారి బాత్రూం కి వెళ్ళాలి ఎక్కడైనా ఆపు భయ్యా అని ? తాను అక్కడ వచ్చి నిలబడగానే డ్రైవర్ఏ తన అవస్థ చూసి, ఇంకా రాజముండ్రి దాకా ఎక్కడ బాత్రూమ్స్ ఉండవు మేడం అని చెప్పేసాడు. భగవంతుడా ఇంకా రాజముండ్రి దాకానా? సంధ్య గుండెల్లో రాయి పడింది..ఇంకో 2 గంటలు, ఎలాగో తెలియట్లేదు.
దేశం లో ఇంట మంది బస్సు ల్లో ప్రయాణాలు చేస్తున్నారు, అందరు ఆడవాళ్ళూ ఇలాగె బాధ పడుతున్నారా అని తన చుట్టూ చూసింది. ఎవరో ఒక ముసలాయన లేచి డ్రైవర్ కేబిన్ దగ్గరకు వెళ్ళాడు. ఈ  సరి సంధ్య అతను ఎందుకు వెళ్ళాడో ఎవరూ చెప్పక్కర్లేకుండా తెలిసిపోయింది.  కాసేపట్లో బస్సు ఆగింది. ఛ మగవాళ్ల బతుకు ఎంత సులువు గా ఉంటుంది అని ఏమి చెయ్యలేని సంధ్య తలా పట్టుకు కూర్చుంది. పోనీ ఏం చెయ్యాలో తెలియక బయటకు చూద్దాం అని కిటికీ తెరిచింది, చలికి పరిస్థితి ఇంకా చెయ్యి దాటుతోంది అని తెల్సుకుని కిటికీ మూసేసింది. మెల్లిగా తెల్లవారుతోంది.  రాజముండ్రి దగ్గరలోకి వస్తోంది. ఒక పెట్రోల్ బంక్ దగ్గర్లో బస్సు ఎవర్నో దింపడానికి ఆగింది. సంధ్య ఇంకా ఆలస్యం చెయ్యదల్చుకోలేదు. తన హ్యాండ్ బ్యాగు, బ్యాగు తీస్కుని వెంటనే దిగిపోయింది. క్లీనర్ ఆశర్యం గా మీకు  వైజాగ్ వరకు టికెట్ ఉంది కదా మేడం, ఇక్కడే దిగిపోతున్నారే అని అడిగాడు. "ఆడదాన్నై పుట్టినందుకు, నీ బస్సు కి బాత్రూం లేనందుకు" ఈ  మాటలు సంధ్య పైకి అనలేదు. దిగిపోయింది. దాదాపు పరిగెడుతూ పెట్రోల్ బంక్ చేరుకుంది. అక్కడ ఉండే అబ్బాయి ని రెస్టరూమ్స్ ఎక్కడ అని అడిగింది, అతను ఒక వైపు చెయ్యి చూపెట్టాడు. సంధ్య చిన్నతనం లో రన్నింగ్ రేస్ లో కూడా అంత వేగం గా వెళ్ళలేదు. రెస్ట్ రూమ్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా భారం దిగినట్టు అనిపించింద,  నిటూర్పు విడిచి వైజాగ్ బస్సు స్టాండ్ వైపు నడిచింది. అక్కడే ఉన్న విమెన్ ఎంపవర్మెంట్ ఫ్లెక్సీని సంధ్య చూడలేదు।। చుస్తే ఇంకొకసారి మనసారా తిట్టుకునేదే!!

Wednesday, May 1, 2019

తెలుగు వాళ్ళ హిందీ కష్టాలు

"దేశ భాషలందు తెలుగు లెస్స" అన్నారు రాయల వారు. ఈ విషయం తెలుగు రాష్ట్రం లోనే చెప్పినట్లు న్నారు. అందుకే హిందీ కి ఉన్న గుర్తింపు తెలుగుకి లేదు. మిగతా రాష్ట్రాలలో హిందీ దే పై చెయ్యి. ఒక హిందీ రాని తెలుగు వ్యక్తి వేరే రాష్ట్రం వెళితే అక్కడ ఎదురయ్య కొన్ని కష్టాలు:
1.  వాహన చోదకులు(car/auto drivers) 
అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. వాళ్లకి మనకీ ఒకటే పోలిక. వాళ్ళకి ఇంగ్లీషు, మనకి హిందీ  అంతంత మాత్రంగానే వచ్చు. పోనీ ఏదో మనకి వచ్చిన హిందీ ఇంగ్లీష్ మిక్సి లో వేసి అడ్రస్ చెప్తే "నాయే ఆయీ? హిందీ నహీ జాంతీ?" అంటూ మనల్ని అవమానం చేసేస్తాడు. 
పైగా కొందరయితే హిందీ రాదురా మహానుభావా అంటే క్యాబ్ ఎక్కిన దగ్గర నుండి లోడ లోడా వాగుతూనే ఉంటారు. ఆ ఊరి గొప్పతనం, దాని పూర్వాపరాలు ఇంకా ఏదేదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.  మనం తెల్ల మొహం వేస్కుని తల ఊపడమే!!

hindi1


2. నేస్తులు (collegues)
ఇక్కడ ఇంకో దారి ఉంది. ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు. కానీ ఈ హిందీ వాళ్ళు ఉన్నారే! వీళ్ల దుంపలు తెగ, హిందీ లోనే మాట్లాడతారు. ఇంగ్లీషు లో మొదలెట్టినా హిందీ లో కి జంప్ చేస్తారు.ఏదో నలుగురితో మాట్లాడదాం అనుకుంటే వీళ్లేమో ఇలా ఏడిపించేస్తారు.

hindi2


3. పనిమనుషులు(Helpers)
వీళ్ళ తో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళు ఒక్కోసారి గ్రాంథిక హిందీ లోకి వెళ్ళారంటే ఆ సునామీ ని తట్టుకోవడం మన వల్ల కాదు. తిడుతున్నారో, పొగుడుతూ ఉన్నారో తెలియదు.


hindi3


4. సినిమాలు
కొన్ని హిందీ  సినిమాలు ఉంటాయి, ఎక్కడ మనలాంటి వాళ్ళకి అర్థం ఐపోతుందో అని తీసినట్టు ఉంటాయి. డైలాగులు అర్థం కావు,పాటలు అర్థం కావు, ఏదో కష్టపడి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో సినిమా అర్థం చేసుకుందాం అంకుంటాం! మన పక్కన వాళ్ళు ఊరుకొనిస్తేనా? మధ్యలో జోకులకి నవ్వుతూ ఉంటారు. సెంటిమెంట్ సీన్లు వస్తే ఏడుస్తారు. గీత లో చెప్పినట్టు మనం నవ్వుకి ఏడుపుకి అతీతంగా సినిమా చూస్తాం.
hindi4



5. స్నేహితులు
కొన్ని బలీయమైన పరిస్థితులలో మన స్నేహితుల కుటుంబం ని కలవాల్సి వస్తుంది.
 ఇది నరకం!! ఒక్క హిందీ నే తట్టుకోలేం అనుకుంటే, అక్కడ కుటుంబం కుటుంబం అంతా హిందీ ఏ. ఆ ఇంటి వాళ్ళు చాలా ప్రేమ తో మాట్లాడతారు,కానీ మనకి అర్థం కావాలి కదా! పక్కన ఎవరైనా హిందీ తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళాలి తప్ప ఒక్కళ్ళు వెళ్ళమా. ఇక అంతే సంగతులు!!
hindi5


ఇంకా కూరలు అమ్మే వాడు దగ్గర నుండి  కస్టమర్ కేర్  దాకా అందరూ మనకి హిందీ రాదని గుర్తుచేసే వాళ్ళే. అయినా తెలుగు వాళ్ళం తలచుకుంటే హిందీ నేర్చుకో లేమా చెప్పండి? అవసరం అయితే వాళ్ళకే తెలుగు నేర్పించే ద్దాం!!!


Gif Source: Google

Tuesday, July 10, 2012

Saw Anna Hazare today..!!!
బజార్ లోకి షాపింగ్ కి వెళ్ళా ..అనుకోకుండా అక్కడ అన్నా హజారే ని చూసాను.. మొదట ఎవరో అనుకున్నా కాని, ఆ బ్యానర్ మీద ఫోటో ఆయన మొహం మార్చి మార్చి చూస్తే అర్ధం అయ్యింది..ఒక్క నిమిషం షాక్ లో ఉన్నా..ఎక్కడ hunger strike చేసిన హజారే ??? ఎక్కడ బేగం బజార్ ??? నాకు ఈ అనుమానం రావడానికి ముఖ్యమైన కారణం,అక్కడ జనాలు ఎవరు ఆయనని పట్టించుకోకపోవడం ..తర్వాత గుర్తుకు వచ్చింది....ఇది ఇండియా అని..ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యడం అంటే మహా పాపం చేసినట్టు..ఎవరి పని వాళ్ళు ఉన్నారు తప్ప అసలు ఆయన ఎం చెప్తున్నారో విందాం అనే ధ్యాస కూడా లేదు...మరీ అన్యాయం ఏంటంటే ఆయన open top van ఆ ఇరుకు సందులో ముందుకు వెళుతుంటే వెనక నుండి ఆ van ముందుకు వెళ్ళట్లేదు అని వెనకాల వాళ్ళు హారన్ కొడుతున్నారు..ఎంత సిగ్గు చేటు??
            ప్రజలని లంచం బారి నుండి తప్పిద్దాం,ఏదో ఒకటి చేద్దాం అని అనుకున్న ఒక స్వాతంత్ర సమర యోధుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా?? ఆయన ఆశయానికి కాదు కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వట్లేదు మన వాళ్ళు..!!! ఎంత ఎదిగిపోయారంటే ముసలివాడు ఏదో చెప్తున్నాడు,తోసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం  అని అనుకుంటున్నారు..అసలు అదే ఒకే ఒక సినిమా చేసిన ఆర్టిస్ట్ వచ్చిన మన వాళ్ళుఎగబడి చూసేవారు..కళాకారులను గౌరవించద్దు  అని నేను చెప్పడం లేదు..కాని మనం కట్టిన tax లు మింగి, black money లు చేస్కుని, ధరలు పెంచేసి,మనకి కనీసం అవసరమైనవి కూడా అందుబాటు లో లేకుండా తినేసి,సరైన మందులు కూడా లేకుండా చేసి,లంచం అనే మహమ్మారి ని ఎక్కడ పడితే పుట్ట గొడుగులలా పుట్టించి,ఏలాగూ లంచం ఇస్తున్నాం కదా తప్పు maximum  చేసేద్దాం అని అందరి నరనరల్లోను ఇంకిపోయేలా చెయ్యగలిగిన మన నాయకుల్ని కనీసం ఒక్కసారి అయినా ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య దేశం లో మనకి లేదంటారా?? మనకి ఎందుకు అసలే time  లేదు  అనే escapisim తోనూ,అడిగితే వెర్రి వాడి లా సమాజం  చూస్తుంది అనే భయం తోనూ మనం ఎలాగూ నోరు తెరవలెం..కనీసం మన కోసం కష్టపడుతున్న వాళ్ళని గుర్తించడం కూడా నేర్చుకోలేదు ..సిగ్గు చేటు !!

         ఎవరికీ వారు సక్రమంగా వారి వారి విధులను నిర్వర్తించి,మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన విలువలు,నీతి,నిజాయతీ,సంప్రదాయాలు ఖచ్చితంగా పాటిస్తే ఇలా ఎవరో మన కోసం నిరాహార దీక్ష చెయ్యక్కరలేదు ,మనమూ సమాజాన్ని తిట్టుకోక్కరలేదు..
"Every man life time dream is an Utopia,where family planning is compulsory,no smoking,no drinks,one man-one plant,no temple,no church,no mosque,only prayer hall,no heritage of property and no politics"

Monday, August 15, 2011

Dedicated to people who celebrate Independence day

Mundu ga andariki swatantra dinotsava subhakankshalu..ee subha sandarbhanni puraskarinchukuni ma inti pakkana kirana shop variki desa bhakti bhareega tala ki ekki,janda vandanam,sweetla karyakramalu nirvighnam ga poorthi chesadu,intavaraku bane undi..tarwata guiness records kuda baddallaye decibel sound to desa bhakti geetala record start chesadu...selavu roju kada koncham ekkuva sepu nidrapodam anukune ma street vallandarini lepi kurchbettadu..road mida vellevallu aa egaresina jhanda vanka kanneti kuda chudatledu..chusinavvalu ekkada time waste aipotundemo ani hadavidi ga vellipotunaru..jhanda egaresina vadu matram tana popularity kosam paakuladutunnadu...ilanti vallandariki nenu chepedi okate,miku desa bhakti unte daya chesi intlo chupinchukondi leda maree ekkuvaithe desaniki seva cheyyandi.seva ante milatry loki vellipovakkarledu..atleast manam cheyyavalasina,cheyyakudani panulu konni unnai ani telusukondi..cheyyavalasinavi akkarledu,cheyyakudanivi aapeste sagam chesinatte..atleast road ki left side lo nadavadam,bandi nadapadam.atleast road mida chetta veyyakudadu ane common sense..inta kharchu petti jhanda egaresi,sweets pancharu kada..ante kharchu petti municipality vallani pilichi ade road mida unna stray dogs ni pattinchachukada..anduku lancham ichina punyame...kaneesam veedhiki panikoche panulu kuda cheyyakunda,maku desa bhakti undani jhanda egareyyadam chala silly ga undi..Independence day ani desaniki edo cheseyyalani tv lo vache desabhakti cinemalu varasaga chusi,aavesa padi, 16th aug morning nundi evari panullo vallu padipotunanru..malli aug 15th kosam wait chestam,mali sweets,malli cinemalu,malli edo cheddam ane..prati independence day ki ilage jarugutundi..ee okka rojaina desanni taluchukovadda ani antaru..ee okka roju pattinchukuni migata 364 days vadilestam,anduke ee roju kuda talchukovadam anavasaram antunna..talchukuni emi cheyyalekapovadam kante roju lage evadi pani vallu chuskodam anniti kanna uttamam..

P.S: inta raasanu ani naku desa bhakti undi anukunte meeru pappulo kalesinatte..nenu rasindi desabhakti undi ani CHEPPUKUNE vallaki,teliyadaniki...naku desabhakti aslu ledu..politicians dagara nundi,ma inti pakkana kirana shop vadi varaku andaru cheptunnaru kada,adedo cheyyandi..kani ila andarini ibbandi petti me desa bhakti ni chaatakandi..mukhyam ga loud speakers petti nidra paaducheyyakandi..nidra ante bangaaram..
This is dedicated especialy to my neighbour kirana shop owner

Monday, August 8, 2011

"MANISHI BHASHA KANIPETTI PEDDA TAPPU CHESADU,KONNI FEELINGS MATALLO CHEPPALEM"
This was a movie dialouge,it is the best dialouge I've ever heard..Really I cant express my feelings on this friendship day..My friends are best people in this world..I just not only shared the things,but also learn t so many things from them..They gave me what ever I want and also what ever I need..I'm very thankful to them..Dear friends you gave me every thing affection,admiration,competition, inspiration,love,hatred,what else everything..You gave me all the experiences as stones which I would need to lay a path of my life..You made me TOUGH..You made my life easy..now no one can hurt me..or at least I'll not be that sensitive to get hurt by anyone..Now my journey is a cake walk..

"THANK YOU" Friends for being with me..
"THANK YOU" for leaving me alone..
"THANK YOU" for making my every minute lively when I'm with you..
"THANK YOU" for making my life easy even without you...
THANKS for everything...

Wednesday, March 9, 2011

One experience I had

Office buses lo seats kosam memu roju pradhanalu chestam.dorikindante adrustam,ledante security check up daggara sniffer dogs ki bhayapadani vallu bus lo nilchuntene better..aa roju na adrustam koddi(naku kukkalu ante bhayam) bus lo seat dorikindi,adi kuda oka bakka ga unna madam pakkana..ma mundu seat lo oka madam ontari ga kurchuni undi..nenu alavatu prakaram mp3 player teesi earphones lo songs vinadam start chesa..kani aa dokku bus daba daba ani chese sound+ ee iddaru madams kaburlu cheppukune sound,nannu mottaniki songs vinakunda chesesai..sare ear phones teesesi bayataki chudadam modalu petta..anukokunda valla maatalu na chevilo paddai..antaku mundu roju jarigina seminar gurinchi matladukuntunarani ardham ayyindi..a seminar viseshalu na pakkana kurchunna madam,mundu madam ki cheptondi..
                 "Aavida Psychriatrist ea kadu Gynacolagist kuda ata..andaru -ve thoughts to ela untamo ninna bhale cheppindi..tension lo unnappudu excess-eating,excess-talking chestam ani cheppindi..madhyalo jokes vesi chaala baaga cheppindi" ani na pakka unna saroja madam cheptondi.
Ma mundu kurchunna usha madam venakki tirigi nu cheppedi chala intresting ga undi,chudu nenu enta enthusiastic ga vintunnano annatuga face petti vindam modalu petindi. Evarikaina eduti vallu manam cheppedi vintunnaru ante manam inka cheptam kada(cheppevadiki vinevadu lokuva annattu ga) saroja inka intresting ga bus dabadaba sound lo ekkada tana matter miss aipotundemo ani mundu ki vongi cheptondi."Excess-talking ante andaroo gossips ekkuva matladukuntaru kada ante evaraina edaina sari katukuni vaste vallaki adi set avvaledu ani,avvani manaki enduku?? ala anukodam valla vella energy anthe vallaki pass aipotundi" ani cheptondi..matter chala intresting ga undi ani nenu bayataki chestune vella maatalu vintunna.Usha madam ki appatiki discussion penchadaniki kavalsina point dorikinattu ga moham lo chinna smile ichi saroja ni lokuva cheyyadam modalu pettindi(usha cheppadam start chsindi).
                          "Avunu saroja gossips cheppadam valla manaki em labham vastundi??asalu ee matram budhi kuda cheppe vallaki undadu.evaru ela dress cheskuni vaste enduku?nagalu veskuni vaste enduku? Konta mandi untaru..(Chinna pause) cheppakudadu kani mana Uma devi ledu!!! Ne gurinchi ela cheptundo telsa??" ani cheppagane saroja koncham munduki vangi tana enthusiasm ni marokasari chupettindi.Kani pakkana kurchunna naku matram aa seat ki unna handle bus kudupulaki aavida mouth ki ekkada tagulutundo ni bhayam!!! Kani saroja matram ekkada aa handle gurinchi pattinchukune stage lo ledu,prapancham lo prati manshiki tana gurinchi avatali vallu emanukuntunnaro telsukovalane aatruta untundi adi sahajam ani saroja nirupinchindi,"Haa!!! emandi Uma??" adigindi saroja,usha cheppadam modalu pettindi," saroja enduku anta conjuse ga untundi??stop nundi naduchukuni veltanu antundi,Rs.20 pedithe auto lo vellipovachu kada ani!! Paiga pelli kuda avvaledu evariki dachi pettali?pillalu leru evaru leru ani andi na daggara!!" ani usha chinna pause ichindi saroja reaction kosam(appati varaku avidaki pelli avaledu ani naku teliyadu).
Saroja nenu anukunna dani kanna violent ga react ayyindi,"Nenu ela velte avidaki enduku?asalu ee vayasulo nenu job maneddam anukunnanu,kani naku koncham charity ivvadam ekkuva,evaraina peda vallu kanipiste nenu dabbulu gani,battalu gani istu untanu(Nenu nu anukunnata chepa kadu ani Usha ki,vintunna naku doubts clear chestondi) Ilanti vatiki dabbulu lekunda ela usha???ee rojulo dabbulu enta necessity aipoyindi??anduke nenu job manatledu..asalu aa uma enduku ila andarimida comments chestundi?? ala anakudadu" ani tana avesam anta vellagakkindi saroja,inka points em cheppalo teliyaka gurthucheskuntu venakki vaalindi..Eeloga Usha andukuni,"avunu evari ibbandulu valavi,ala comment cheyyakudadu,(saroja malli tana enthusiasm ni chatukuni,mundu ki jarigindi)asalu tanu ninne kadu andarini alage comment chestundi.evariana lift mida car lo vacharu ante aa roju anta vala gurinche matladutundi,kani tanu matram enni sarlu aina ravachu car lo..tanakana juniors ki officer positions vachesayi,tanaki matram raledu ani na dagara enni sarlu cheppindo!!evari talent valadi,danki kuda ediste ela?",ani usha kuda oka point add chesindi!!
Saroja ki maro point dorikindi,inkoncham mundu ki jarigi,"Chusava,manam andaram bus digina tarawata oka side nadustam,Uma manato kalavakunda vere side nadustundi" ani chepagane Usha edo kohinoor vajram daggara unna chudalekapoyanu annataga feel ayyi"nenu eppudu gamaninchaledu saroja!!"ani andi..
Saroja kuda Usha mida jaali chupistoo,pravaledu le e sari chudu ani cheppindi."Enduku ala nadustundo telsa??andaru tanani chudali ani,anduke matching matching bands,lipstick lu veskuni vastundi." ani cheptondi,usha avunu annatuga tala oopi,"Aina ee vayasulo edo chinnapillala mustabu avvadam enduku?? maree garvam!!"ani usha anagane,saroja "Valla ayana enta manchi vado,idi varaku nenu ayana oke division lo work chesevallam,saroja chala baga work chestundi ani nannu epudu mechukune vadu kuda!!!asalu ayana VRS teskodaniki kuda avide karanam anukunta..ee badhalu padaleka VRS teskuntene nayam ani tiskunnattunadu(Deenlo naku oka point ardham kaledu,VRS teskunna intlo aina untundi kada vallavida!!!)"ani inka evevo cheptondi!!
                        Uma gurinchi vellandaru cheppinavi nijalo kado naku teliyadu,kani gossips chepadam valal vache nastala gurinchi cheppukuntu teliyakundane gossips cheppukodam loki vellipoyaru.manushulu okalla gurinchi ela matladukuntaro naku appudu baga ardham ayyindi.Ante kadu oka jeevita satyam kuda telisindi,manushullo okallu manchi vallui okallu chedda vallu ani undaru,prati valallonu koncham manchi koncham chedu anevi untai,time ni batti avi bayata padutuntai.Anta manam anukodam lo undi.Manma unna time lo chedu bayata padakapothe vallu manchi vallu,ledante chedda vallu.

Inka naku ee discussion anta vinna tarwata naku konni points ardham ayyayi..
1.Manushulu enta chepina -ve gane alochistaru,-ve thoughts ea mundu vastayi.
2.Mana mida andariki -ve impression unnappude manam ela react avtam anedi mana charecter decide chestundi.
3.Evaraina sare chesina manchi twaraga marchipotaru,chedu matram ekkuva gurthu pettukuntaru..ala ani manchi cheyyaddu anadam na uddesam kadu,manchi chesina,asalem cheyyakapoyina,mana panulu gurinchi evariko okariki intrest untune untundi.so mana intrests padu cheskokkarledu.For example,denlo nenu cheppina uma posh ga kakunda maooluga ready ayyi office ki vachina,vellu tana gurinche matladukuntaru,kakapothe fashion ane topic change avtundi,ea work vishayamo discuss cheskuntunauntaru,anthe tappa vella discussion maradu.

Inni alochinchina tarwata naku boledu gynanam vachina feeling kaligindi,inka ekkuva gnyanam vaste emaipotano annattuga ma office daggaraki vachesindi!!!!

ఎలా???

సంధ్య కి   మూడు రోజుల నుండి గుబులు గా ఉంది . 4 రోజుల క్రితం వాళ్ళ నాన్న గారు ఫోన్   చేసి విశాఖపట్నం   రమన్నారు . సంధ్య ...