సంధ్య
కి మూడు
రోజుల నుండి గుబులు గా
ఉంది. 4 రోజుల
క్రితం వాళ్ళ నాన్న గారు
ఫోన్ చేసి
విశాఖపట్నం రమన్నారు
. సంధ్య డిగ్రీ
అవ్వగానే హైదరాబాద్ వచ్చేసింది ఉద్యోగం కోసం . అక్కడే
ఉద్యోగం దొరకడం, పెళ్లి కొడుకు కూడా అక్కడే ఉండడం
తో సంధ్య పూర్తిగా హైదరాబాద్
కే పరిమితమైపోయింది. ఎప్పుడైనా
పుట్టింటికి మెట్టినింటికి వెళ్లి రావడం తప్ప ఇంకెక్కడికి
వెళ్ళలేదు. ఇప్పుడు
సంధ్య భర్త కూడా ఊళ్ళో
లేదు. ఆఫీస్
పని మీద అమెరికా వెళ్లారు. పిల్లల్ని
అత్తగారు మామ గారు చూసుకుంటారు,
దానికి బెంగ లేదు.
కానీ ఇప్పుడు వెళ్ళడానికి ఒకే సమస్య, ట్రైన్
రిజర్వేషన్ దొరకలేదు. బస్సు
లోనే వెళ్ళాలి, అదీ సంధ్య దిగులు.
మానేద్దామా
అనుకున్నా, అక్కడ జరుగుతున్నది స్వయానా
బాబాయ్ కూతురి పెళ్లి. చిన్నప్పటి
నుండి ఒక దగ్గర పెరిగిన
వాళ్ళు, పెళ్ళికి కూడా వెళ్లకపోతే బావుండదని
బయలు దేరుతోంది. పిల్లలకి
అస్సైన్మెంట్లు, ప్రాజెక్టులు ఉన్నాయ్ అని రాము అన్నారు. పిల్లలని
అత్తగారికి అప్పగించి సంధ్య ఒక్కర్తీ బయలు
దేరింది. రాత్రి
10 గంటలకి బస్సు.
అన్నం
తిని నీళ్లు తాగితే ఎక్కడ టాయిలెట్ కి
ఇబ్బంది పడతానో అని ఎదో చపాతీ
తిన్న అనిపించి కంచం ముందు
నుంచి
లేచిపోయింది. బస్సు
దగ్గరకి వెళ్లే ముందు 2 సార్లు బాత్రూమ్
కి వెళ్లి వచ్చింది. టెన్షన్
లో ఇంకా ఘోరం గా
ఉంది సంధ్య పరిస్థితి.10 గంటలకి రావలసిన బస్సు నిక్కీ నీలిగి 11.30 కి
వచ్చింది। అంతవరకు అక్కడ నిలబడడం తప్ప ఏమి చేయలేకపోయింది సంధ్య. మొత్తానికి బస్సు వచ్చింది,
ఆమె డ్రైవర్ ని సరైన టైం కి రావద్దా అని దులిపేసింది . ఇప్పుడు వచ్చింది ఈ దిక్కుమాలిన
బస్సు ఎప్పటికి వైజాగ్ చేరుతుందో అనుకుంటూ ఎక్కింది . ఆమె ఎక్కినా వెంటనే నిద్రపోవడానికి
విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ డ్రైవర్
వేసే సడన్ బ్రేకులు, మలుపు తిప్పేటప్పుడు పక్కవారి మీద పడేటట్లు గా తిప్పే నేర్పు,
గుంటల్లో మాత్రమే తీసుకెళ్లగలిగిన ఓర్పు తో సంధ్యకు నిద్ర కరువైంది.
దేనికైతే భయపడిందో
మొత్తానికి ఆ క్షణం సంధ్య కి వచ్చేసింది. ఇంతలో
బస్సు ఒక చోట ఆగింది "ఇక్కడ బాత్రూములు కి ఆపుతాం దిగండి దిగండి” అని క్లీనర్
అరుస్తున్నాడు. హమ్మయ్య దేవుడు కరుణించెదనుకుంటూ సంధ్య చుట్టూ చూసింది... తన ఖర్మ కొద్దీ చుట్టూ చిన్న మధ్య ఆఖరి వయసులలో ఉన్న మొగవాళ్ళు తప్ప ఆడవాళ్ళూ ఎవ్వరు
లేవట్లేదు. అయినా తన వల్ల కాదు అనుకుని అందరూ దిగాక తాను బస్సు దిగింది. చూసేసరికి
అక్కడ బాత్రూమ్స్ ఏమి లేవు. ఒక ఓపెన్ ప్లేస్ లో మొగాళ్ళు అందరు ఆ పని కానిస్తున్నారు.
తన బాధను అర్ధం చేసుకున్నాడు అనుకుంట క్లీనర్, " ఆ వైపు వెళ్ళండి మేడం అని చూపించాడు అక్కడ అంతా చీకటి ఖాళీ ప్రదేశం.
"ఎక్కడ " అని అడిగింది ఏమని అడగాలో తెలియక. "ఆలా వెళ్ళండి మేడం పర్వాలేదు
ఎం కనిపించదు " అన్నాడు తనకి సమాధానం గా. సంధ్య సిగ్గు తో చచ్చిపోయింది. కానీ
అక్కడ కనీసం చాటు కూడా లేదు. ఎలా?
సంధ్య
ఎటు వెళ్లలేక బస్సు ఎక్కేసింది.
ఏదైతే అది అవుతుంది అని. అసహ్యం
గా తన బాత్రూం విషయం
ఎవడో తెలియని క్లీనర్ తో ఎలా చర్చించడం?
కానీ ఇప్పుడు వెళ్లకపోతే పొద్దున్న 10 అవుతుందో 11 అవుతుందో వైజాగ్
వెళ్ళేటప్పటికి .
బస్సు
ఎక్కినా సంధ్య పడుకుందాం
అని ట్రై చేసింది, కానీ
దురదృష్టం తనని వెంటాడింది.
పోనీ ఆ ఆలోచన లోంచి
బయటపడి వేరే ఆలోచన చేస్తే
ఏమైనా బావుంటుందని ఫోన్ తీసి యూట్యూబ్
నొక్కింది. అక్కడ
తన అదృష్టం బాలేదు అన్ని నవ్వించే వీడియోస్
ఏ కనిపిస్తున్నాయి, కాసేపు బానే ఉంది అనిపించినా
తరువాత మళ్ళి అదే ఉధృతి. ఏం
చెయ్యడానికి పాలుపోలేదు. దృష్ఠి
మరలార్చడానికి కూడా వీలు కావట్లేదు. మొదటి
సరి మొగవాడి గా పుట్టనందుకు తాను
బాధ పడింది.ఇంతకూ
ముందు మొగవాళ్లందరూ హాయిగా ఆరుబయట తమ పని కానిచ్చారు,
మరి తనకు? ఆడపిల్ల అయినందుకు
ఈ నరకం
తప్పదేమో!!
క్షణ
క్షణానికి ఉదృతి ఎక్కువ అవుతోంది. ట్రైన్
లో టికెట్ బుక్ చేయనందుకు తన
భర్తని, పిలిచినందుకు తన చుట్టాలని, సెలవు
ఇచ్చినందుకు తన బాస్ ని,
వచ్చినందుకు
తనని వెయ్యినొక్క సార్లు తిట్టుకున్నా తరువాత, ఇక ఆగలేక ఎక్కడైనా
డ్రైవర్ బస్సు అవుతాడేమో అని
సంధ్య డ్రైవర్ కేబిన్ వైపు వెళ్ళింది.
ఈ సారి ఆరుబయట
ఐన పర్లేదు అనుకుంది. డ్రైవర్
కేబిన్ లో "ఆకలేస్తే అన్నం పెడతా" అంటూ
సంబంధం లేని పాట ఒకటి
వస్తోంది. అక్కడి
దాకా వచ్చిన సంధ్య కి డ్రైవర్
తో ఎలా చెప్పడం? నేను
ఒకసారి బాత్రూం కి వెళ్ళాలి ఎక్కడైనా
ఆపు భయ్యా అని ? తాను
అక్కడ వచ్చి నిలబడగానే డ్రైవర్ఏ
తన అవస్థ చూసి, ఇంకా
రాజముండ్రి దాకా ఎక్కడ బాత్రూమ్స్
ఉండవు మేడం అని చెప్పేసాడు. భగవంతుడా
ఇంకా రాజముండ్రి దాకానా? సంధ్య గుండెల్లో రాయి
పడింది..ఇంకో
2 గంటలు, ఎలాగో తెలియట్లేదు.
దేశం
లో ఇంట మంది బస్సు
ల్లో ప్రయాణాలు చేస్తున్నారు, అందరు ఆడవాళ్ళూ ఇలాగె
బాధ పడుతున్నారా అని తన చుట్టూ
చూసింది. ఎవరో
ఒక ముసలాయన లేచి డ్రైవర్ కేబిన్
దగ్గరకు వెళ్ళాడు. ఈ
సరి
సంధ్య అతను ఎందుకు వెళ్ళాడో ఎవరూ చెప్పక్కర్లేకుండా తెలిసిపోయింది. కాసేపట్లో
బస్సు ఆగింది. ఛ
మగవాళ్ల బతుకు ఎంత సులువు
గా ఉంటుంది అని ఏమి చెయ్యలేని
సంధ్య తలా పట్టుకు కూర్చుంది. పోనీ
ఏం చెయ్యాలో తెలియక బయటకు చూద్దాం అని
కిటికీ తెరిచింది, చలికి పరిస్థితి ఇంకా
చెయ్యి దాటుతోంది అని తెల్సుకుని కిటికీ
మూసేసింది. మెల్లిగా
తెల్లవారుతోంది.
రాజముండ్రి దగ్గరలోకి వస్తోంది. ఒక
పెట్రోల్ బంక్ దగ్గర్లో బస్సు
ఎవర్నో దింపడానికి ఆగింది. సంధ్య
ఇంకా ఆలస్యం చెయ్యదల్చుకోలేదు. తన
హ్యాండ్ బ్యాగు, బ్యాగు తీస్కుని వెంటనే దిగిపోయింది. క్లీనర్
ఆశర్యం గా మీకు వైజాగ్ వరకు టికెట్ ఉంది
కదా మేడం, ఇక్కడే దిగిపోతున్నారే
అని అడిగాడు. "ఆడదాన్నై పుట్టినందుకు,
నీ బస్సు కి బాత్రూం
లేనందుకు" ఈ మాటలు
సంధ్య పైకి అనలేదు.
దిగిపోయింది. దాదాపు
పరిగెడుతూ పెట్రోల్ బంక్ చేరుకుంది.
అక్కడ ఉండే అబ్బాయి ని
రెస్టరూమ్స్ ఎక్కడ అని అడిగింది,
అతను ఒక వైపు చెయ్యి
చూపెట్టాడు. సంధ్య
చిన్నతనం లో రన్నింగ్ రేస్
లో కూడా అంత వేగం
గా వెళ్ళలేదు. రెస్ట్
రూమ్ నుండి బయటకి వచ్చిన
తర్వాత ఒక్కసారిగా భారం దిగినట్టు అనిపించింద,
నిటూర్పు
విడిచి వైజాగ్ బస్సు స్టాండ్ వైపు
నడిచింది. అక్కడే
ఉన్న విమెన్ ఎంపవర్మెంట్ ఫ్లెక్సీని
సంధ్య చూడలేదు।। చుస్తే
ఇంకొకసారి మనసారా తిట్టుకునేదే!!
No comments:
Post a Comment