ఒకప్పుడు
మార్క్ జుకేర్బర్గ్ ఏ ముహూర్తనమొదలు పెట్టాడో కానీ యువత ని బాగా ఆకట్టుకుంది.అప్పటివరకూ పిల్లల్ని చదువు విషయం లో మాత్రమే తిట్టే తల్లితండ్రులకు కొత్త కోణం దొరికింది.
స్మార్ట్ ఫోన్ లు వచ్చాక దానికి ఇంకా డిమాండ్ పెరిగింది.

" ఎప్పుడు చూసినా ఆ ఫేస్ బుక్ లో ఉంటావు ఎం చేస్తార్రా!!" ఒక బంధువు అనుమానం.
"మా పిల్లలు అస్సలు చదవట్లేదండి, పొద్దున్న లేవగానే ఫేసుబుక్ ఓపెన్ చేస్తాడు.ఇంక అంతే!ఆ ఫోన్ లించి బుర్ర పైకి ఎత్తరు" ఒక తండ్రి ఆగ్రహం.
"ఈ సెల్ వచ్చాక పిల్లలు ఎం తింటున్నారో కూడా చూస్కోవట్లేదు.తిండికి ఫోటో మాత్రం తీసుకుంటారు" ఒక తల్లి ఆవేదన.
"హే నేను పెట్టిన 'ఇడ్లి తింటున్నా 'అనే పోస్ట్ కి ఎన్ని లైక్స్ వచ్చాయో చూసావా?" ఒక ఫ్రెండ్ ఆనందం.
"పిల్లలు పాడైపోతున్నారు ఈ ఫేస్బుక్ వచ్చాక.పెళ్లిళ్లు కూడా ఫేస్బుక్ లొనే చేసేసుకుంటున్నారు. అసలు ఈ ఫేస్బుక్ ని బాన్ చెయ్యాలి" ఒక పెద్దాయన ఆక్రోశం.
తల్లి తండ్రి, చుట్టుపక్కల వాళ్ళు,బంధువులు, ఇంటికొచ్చేవాళ్ళు, ఆఖరికి మన ఇంటి పనిమనుషులు అందరికి వచ్చిన కామన్ డౌట్ పిల్లలు అంతంత సేపు సెల్ ఫోన్లో ఎం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు?
వైఫై కట్టేసే తల్లిదండ్రులు కొంతమంది అయితే, సెల్ ఫోన్ లాగేసుకునే వాళ్ళు కొంతమంది. ఫేస్బుక్ దారుణాలు పేపర్ లో చదివి ఆందోళన పడేవాళ్ళు కొంత మంది అయితే, ఇవన్ని చదివి పిల్లల్ని ఫేస్బుక్ కి దూరం గా ఉండమని నెత్తి నోరు కొట్టుకునేవాళ్లు కొంత మంది.
ఇవన్నీ ఎందుకని పిల్లలు కొంత మంది పెద్దవాళ్లను ఫేస్బుక్ లోకి తీస్కొచారు, కొంతమంది పెద్దవాళ్ళు పిల్లల్ని అడిగి వచ్చారు,కొంత మంది ఏం జరుగుతుందో చూడడానికి వచ్చారు.. అక్కడే మొదలయ్యింది "సీనియర్ ఫేస్బుక్".
ప్రస్తుతం
(చాలా మంది ఫేస్బుక్ లోకి వచ్చేసారు.వారిలో సీనియర్ సిటిజన్స్ ని మాత్రమే నేను వర్గీకరించాను.)

1.భక్తజనం:
ఫేస్బుక్ వాల్ ని భక్తి ఛానెల్ లా మార్చేసి,కొత్త కొత్త పురాణాలు, కొత్త కధలు పోస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు.స్వామి పరిపూర్ణనానంద,చాగంటి కోటేశ్వర రావు గారు,గరికపాటి గారి శిష్య పరమాణువులు వీళ్ళు.

2.ట్యాగ్ బృందం:
ఎందుకు టాగ్ చేస్తారో కూడా తెలియకుండా, ఏడా పెడా ప్రతి పోస్ట్ లోను అందరిని టాగ్ చేసేవాళ్ళు కొంత మంది.గోయింగ్ టు షిరిడి విత్ 40 మంది. కానీ వారితో వెళ్ళేది ఇద్దరే!! ఇలా ఉంటుంది వారి యాత్రలు.

3.చైన్ బ్యాచ్:
ఎక్కడినుంచో వచ్చే చైన్ మేసేజ్ లు అందరికి ఫార్వర్డ్ చేసి పడేస్తారు.
"ఈ రోజు అంగారక గ్రహం భూమి కి దగ్గరగా వస్తోంది సెల్ ఆఫ్ చెయ్యండి"
"ఈ ఫోటో షేర్ చేస్తే 5 రూపాయలు ఇస్తారు" ఇలాంటివన్నమాట!!

4.డౌన్లోడ్ కింగ్స్:
ఎవరైనా ఫోటో పెట్టడం ఆలస్యం! వెంటనే డౌన్లోడ్ చేసేస్తారు వీళ్ళు. అది దేవుడి ఫోటో ఐనా,మనుషుల ఫోటో ఐనా! కొత్త కొత్త ఫోటోలు కోసం వీళ్ళు గూగుల్ మాతని నమ్ముకున్నారు.

5.మనసున్న మారాజులు
"Feeling sad" "Feeling happy"( ఎందుకో మనం కామెంట్స్ లో అడగలన్నమాట)
" Travelling to USA with family" (స్నేహితులకు వీడ్కోలా?దొంగలకు ఆహ్వానమా?)
"Watching old movie"(ఐతే ఎం చెయ్యమంటారు సార్?)
వీళ్ళు మనసులో ఏదీ దాచుకోలేరు. ఊరు వెళ్తున్నా, నిద్రపోతున్నా, అన్నం తింటున్నా, ఆఖరికి పక్కింటి వెళ్ళినా,హాస్పిటల్ కి వెళ్ళినా ఫేస్బుక్ లో పోస్ట్ ఉండాల్సిందే!!

6.సునామి స్టార్స్
ఎవ్వరైనా ఏదన్నా పోస్ట్ కానీ ఫోటో కానీ పెడితే వెంటనే లైక్/కామెంట్ పెట్టే సమయ పాలన ఉన్నవారు. ఎక్కడ,ఎప్పుడు,ఎలా,ఎందుకు అనే ప్రశ్నల సునామి తో చరిత్ర అంతా అక్కడే చెప్పించేస్తారు.

7.డిటెక్టీవ్ నారద
ఆన్లైన్లో ఉంటూనే ఎవరెవరు ఎం చేస్తున్నారు అని కూపీ లాగుతూ ఉండేవాళ్ళు.

ఇప్పుడు యువత పెద్దవాళ్ళని "ఇంక ఫోన్ చాలు,మేము ఉన్నాం మాతో మాట్లాడండి" అనే అంత స్థాయికి వచ్చేసారు.రాత్రి దుప్పట్లో ఫోన్ చూసుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్తే సెల్ఫీ తప్పనిసరి ఫేస్బుక్ లో ఫోటో కోసం.
ఇవన్నీ కొన్నాళ్ల క్రితం పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు పిల్లల్ని.ఇప్పుడు పెద్దవాళ్ళని ఏమనలో తెలియక యువత సతమతం అవుతోంది!! కాదనగలరా?!!
జై మార్క్ జుకేర్బర్గ్!!!
Gif source: tenor.com